పార్ట్‌టైం ఉద్యోగులపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం – ఎంఎస్ఎఫ్

  •  పార్ట్ టైం ఉద్యోగులపై నిర్లక్ష్యం తగదు
  •  ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఎంఎస్ఎఫ్ అధ్యక్షుడు బుక్కాపురం మహేష్ 

 

అచ్చంపేట, లోకవాణి న్యూస్ : ఎస్సీ గురుకుల పార్ట్‌టైం ఉద్యోగులపై ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎంఎస్ఎఫ్ ( మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ) అధ్యక్షుడు బుక్కాపురం మహేష్ అన్నారు. అచ్చంపేట పట్టణ కేంద్రంలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన పత్రిక సమావేశంలో మాట్లాడారు…గత నాలుగు నెలలుగా ఎస్సీ గురుకుల పార్ట్‌టైం ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకపోవడంతో వారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తక్కువ జీతాలతో కష్టపడి పని చేస్తున్న ఈ ఉద్యోగులు కుటుంబాలను పోషించడంలో తీవ్ర కష్టాలు పడుతున్నారని, ప్రభుత్వం వారి సమస్యల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా ఉందని విమర్శించారు. ఇతర ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులల్లో వేతనాలు విడుదల చేస్తూ కేవలం ఎస్సీ గురుకుల ఉద్యోగులను పక్కన పెట్టడం ఉద్దేశపూర్వక వివక్ష అని పేర్కొన్నారు. ఇది పేద ఎస్సీ విద్యార్థులపై వివక్ష మాత్రమే కాకుండా, సామాజిక న్యాయాన్ని అవమానించే చర్యగా, గురుకుల వ్యవస్థను బలహీనపరచే ప్రయత్నంగా ఎంఎస్ఎఫ్ అభిప్రాయపడిందన్నారు. మంత్రులు, అధికారులు రాజకీయ వేదికలపై పరస్పర విమర్శలు చేసుకోవడంలో సమయం గడిపేస్తూ, తమ శాఖల్లో వేతనాలు విడుదల చేయకపోవడం పరిపాలనా వైఫల్యమని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలను విడుదల చేయకపోతే, గౌ. శ్రీ మందకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. విద్యాసంస్థల వద్ద నిరసనలు, ముఖ్యమంత్రి కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించడానికీ వెనుకాడబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఏడెల్లి ఆంజనేయులు, రాజు, శ్రీనాధ్, అంజి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe