సూర్యాపేట అక్టోబర్ 18: సూర్యాపేట జిల్లా జెడ్‌పీహెచ్‌ఎస్ నర్సాపూర్ ఫిజికల్ డైరెక్టర్ వెన్నమల్ల విజయ్‌కుమార్ నేషనల్ లెవల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో టెక్నికల్ ఆఫిషియల్‌గా నియమితులయ్యారు. అక్టోబర్ 15 నుంచి 18 వరకు లక్‌నోలో జరుగుతున్న ఇండియన్ ఓపెన్ అండర్–23 నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆయన సేవలు అందిస్తున్నారు. విజయ్‌కుమార్ నియామకంపై జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి, క్రీడాధికారులు శేఖావత్ కృష్ణన్ గౌడ్, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
