తుమ్మన్‌పేట గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

అచ్చంపేట, అక్టోబర్ 27: నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం తుమ్మన్‌పేట గ్రామంలో PACS ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రభుత్వం రైతు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ దళారి వ్యవస్థకు చెక్ పెట్టి, PACS ద్వారా నేరుగా రైతుల వద్ద నుంచే మొక్కజొన్న కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేసిందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో MRO శ్రీకాంత్, PACS చైర్మన్ నరసయ్య యాదవ్, మండల అధ్యక్షులు మల్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాంప్రసాద్ గౌడ్, వైస్ చైర్మన్ కురుమయ్య, సీఈవో రాజవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ AD చంద్రశేఖర్, మండల అధికారి నరేష్, మాజీ సర్పంచులు సుధాకర్ గౌడ్, తిరుపతి రావు, ఎల్లికంటి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు మషన్న, డైరెక్టర్లు నిరంజన్ గౌడ్, శ్రీపతి రావు, లాలురెడ్డి, మల్లికార్జున్, అంజన్ రెడ్డి, అనిల్ గౌడ్, సురేష్, మసూద్, ఇమ్మడి సైదులు, వెంకటయ్య, AEO, GPO, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

 

WhatsApp Join Now
Youtube Subscribe