జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రచారం వేగం

హైదరాబాద్, అక్టోబర్ 27: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఇంచార్జ్ ఎంపీ డాక్టర్ మల్లు రవి తో కలిసి, టిపిసిసి ఉపాధ్యక్షులు, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ బోరబండ డివిజన్ పరిధిలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — “జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించి ప్రజల అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి” అని ఓటర్లను కోరారు. బట్టలు ఇస్త్రీ చేస్తూ, చేతులు కలుపుతూ ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. నవంబర్ 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ డిసిసిబి చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, అమ్రాబాద్ సింగిల్ విండో చైర్మన్ పోషం గణేష్, బోరబండ డివిజన్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe