లోకవాణి న్యూస్, అచ్చంపేట 02: డిసెంబర్ 29, 30 తేదీలలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనలో సెమినార్ విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తుమ్మన్పేటకు చెందిన విద్యార్థి ఎండి. సాదిక్ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థిని ప్రశంసించి ప్రశంసా పత్రంతో పాటు మెమొంటోను అందజేశారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని పాఠశాల యాజమాన్యం అభినందించింది. విద్యార్థి సాధించిన విజయం ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల రాజస్వ ప్రధానోపాధ్యాయులు శ్రీ బి.గజేంద్ర శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
