జయ జయహే తెలంగాణ” సృష్టికర్త అందెశ్రీకి ఘన నివాళి

లోకవాణి, అచ్చంపేట, నవంబర్ 10:  ప్రజా కవి, గాయకుడు, “జయ జయహే తెలంగాణ జననీ జనకేతనం” పాట సృష్టికర్త డాక్టర్ అందెశ్రీ (ఎల్లయ్య)మరణ సంతాప సభ సోమవారం అచ్చంపేట పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థి జేఏసీ చైర్మన్ శ్రీను నాయక్ అధ్యక్షత వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన జేఏసీ ఉద్యమ నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ అందెశ్రీ మరణం రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కవితా, కళా కృషి విశేషమైందని, తెలంగాణకు సాంస్కృతిక ఆత్మ ఇచ్చిన వ్యక్తిగా కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి, తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించారు.  ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎంపీపీలు రామనాథం, అవట శ్రీనివాసులు, జేఏసీ చైర్మన్ కాశన్న యాదవ్, సలహాదారులు మండికరి బాలాజీ, ధర్మనాయక్, ఆర్టీసీ సంఘం నేత పర్వతాలు, యువజన సంఘం అధ్యక్షుడు రవికుమార్, యుటిఎఫ్ నేత రాములు, సిపిఎం పార్టీ నేత శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe