ఘనంగా అబ్దుల్ కలాం జయంతి

ఉప్పునుంతల, అక్టోబర్ 15: ఉప్పునుంతల బాలుర ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఉదయం 10:30 మిస్సైల్ మ్యాన్ డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం 94వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత మాట్లాడారు. కలాం జీవితం, దేశ సేవలు, విద్యార్థులకు ఇచ్చిన ప్రేరణను స్మరించుకున్నారు. పేద కుటుంబం నుంచి దేశ రాష్ట్రపతిగా ఎదిగిన కలాం జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

WhatsApp Join Now
Youtube Subscribe