నాగర్కర్నూల్, అక్టోబర్ 7:
- నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన 8మంది విద్యార్థులు రాష్ట్ర క్రీడా పాఠశాలల్లో ఎంపిక
నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని వివిధ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు ఎంపికైన 8 మంది విద్యార్థులను జిల్లా అదనపు కలెక్టర్లు శ్రీ పి. అమరేందర్ (రెవిన్యూ), శ్రీ బి. దేవసహాయం (లోకల్ బాడీస్ – F.A.C) అభినందించారు. 2025 జూలై 4, 5 తేదీలలో హకీంపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలల ఎంపికల్లో నాగర్కర్నూల్ జిల్లా నుండి 6 మంది బాలురు, 2 మంది బాలికలు రాష్ట్రంలోని వివిధ క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులు:
హకీంపేట తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్:
1. బోజగని ప్రణీత్
2. పూజారి అరుణ్
3. సింగగల్ల వైష్ణవి
4. చిక్కోడ్ర ఓంకార్
5. రథ్లావత్ మనోజ్ రాథోడ్
6. మాండ్ల జ్ఞానేశ్వర
కరీంనగర్ రీజినల్ స్పోర్ట్స్ స్కూల్:
1. కద్దం జాన్వి మెహ్రా
అదిలాబాద్ రీజినల్ స్పోర్ట్స్ స్కూల్:
1. రథ్లావత్ విగేంధర్ నాయక్
ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్లు విద్యార్థులను అభినందిస్తూ, క్రీడల్లో మరింత ప్రతిభ కనబరచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల అధికారి వి. సీతారాం, డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయక్, జిల్లా యువజన క్రీడల శాఖ సిబ్బంది, పీఈటీ లు పాల్గొన్నారు.
