అచ్చంపేట, అక్టోబర్ 19:
మహబూబ్‌నగర్ జిల్లాలోని ఇండోర్ స్టేడియంలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి బాలికల కిక్ బాక్సింగ్ పోటీల్లో అచ్చంపేట విద్యార్థినులు తమ ప్రతిభను చాటారు. ఈ పోటీల్లో నల్లమల్ల ప్రాంతానికి చెందిన రామావత్ మోక్ష శ్రీ బంగారు పతకం గెలుచుకోగా, రాజ్‌పుత్ దీక్షిత మరియు మహాలక్ష్మి కాంస్య పతకాలు సాధించారు. క్రీడా మైదానంలో తమ ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థినులు పట్టుదల, క్రమశిక్షణ, కృషితో ఇతర క్రీడాకారిణులకు ఆదర్శంగా నిలిచారు. విద్యార్థినుల విజయంపై శిక్షకులు శ్రీనాథ్ చౌహన్, నాగర్‌కర్నూల్ జిల్లా కిక్ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు రాజు నాయక్ ప్రశంసలు కురిపించారు. వారు మాట్లాడుతూ — “అచ్చంపేట బాలికలు చూపిన ప్రతిభ భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో కూడా మెరుగైన ఫలితాలను ఇవ్వగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.” విద్యార్థినుల తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది వారికి అభినందనలు తెలిపారు. ఈ విజయంతో అచ్చంపేట ప్రాంతంలో కిక్ బాక్సింగ్ క్రీడపై కొత్త ఉత్సాహం నెలకొంది.
