అచ్చంపేట లోకవాణి న్యూస్ : అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం సోమవారం అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ఉపాధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ…“కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థుల గెలుపే ప్రతి కార్యకర్త లక్ష్యంగా పెట్టుకోవాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు రమేష్ గౌడ్, సీనియర్ నాయకులు అల్వాల్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు మల్లయ్య, సురేందర్ రెడ్డి, జంగయ్య, తిరుమలయ్య, హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
