అచ్చంపేట, అక్టోబర్ 19: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలోని చంద్ర గార్డెన్‌లో ఆదివారం నిర్వహించిన కరాటే పోటీల్లో అచ్చంపేట విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పోటీలను జీకే మాస్టర్ షాటోకన్ కరాటే డు ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించగా, అచ్చంపేట వీఆర్ మార్షియల్ ఆర్ట్స్ అకాడమీకు చెందిన విద్యార్థులు అండర్–12, అండర్–14 విభాగాల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఈ సందర్భంగా అకాడమీ మాస్టర్ శ్రీనాథ్ చౌహన్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో సాధన చేస్తూ మంచి ఫలితాలు సాధించారని తెలిపారు. విజేతలను కరాటే డు అసోసియేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాజు నాయక్, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
