ఎస్జీఎఫ్ పోటీల్లో అచ్చంపేట విద్యార్థుల ప్రతిభ

లోకవాణి, అచ్చంపేట, నవంబర్ 2:  ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీల్లో అచ్చంపేట విద్యార్థులు పాల్గొని సత్తా చాటినట్లు శిక్షకులు సందీప్, అస్లామ్ తెలిపారు. అండర్ 14, 17 బాల, బాలికల విభాగంలో ఇషాన్ కుమార్, రిషిత, దుర్గా దేవీ, కార్తీక్ పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. వీరిని గ్రాండ్ మాస్టర్ రాజు నాయక్ అభినందించారు.

WhatsApp Join Now
Youtube Subscribe