ఎన్నికల శిక్షణ తరగతులకు హాజరుకాని సిబ్బందికి  షోకాజ్ నోటీసులు

లోకవాణి, అచ్చంపేట, 08: నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన మొదటి విడత, రెండవ దశ శిక్షణ తరగతులకు గైర్హాజరైన సిబ్బందికి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ చర్యలు చేపట్టారు. పీఓ, ఏపీఓ, ఓపీఓ లుగా ఎన్నికల విధుల నిర్వహణకు ఆర్డర్ కాపీలు తీసుకున్న 206 మంది వివిధ శాఖలకు చెందిన పోలింగ్ సిబ్బంది శిక్షణ తరగతులకు హాజరుకాలేదు. దీనిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర్వులను అతిక్రమించినందుకు వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు పూనుకున్నారు. శిక్షణా తరగతులకు గైర్హాజరైన సిబ్బందికి షోకాజ్​ నోటీసు జారీ చేసినట్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి బాధావత్ సంతోష్ ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల శిక్షణా తరగతులకు గైర్హాజరైన షోకాజ్ నోటీస్ అందుకున్న సిబ్బంది 24 గంటల్లోపు సరైన కారణాలతో వివరణ సమర్పించాలని, లేనిపక్షంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 లోని విభాగం 224 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదవ సంతోష్ సోమవారం సాయంత్రం పత్రిక ప్రకటనలో వెల్లడించారు

WhatsApp Join Now
Youtube Subscribe