ఉద్యమకారుల హామీలు అమలు చేయకపోతే మరో ఉద్యమం: అచ్చంపేట టీ–జేఏసీ హెచ్చరిక

లోకవాణి, న్యూస్, అచ్చంపేట : తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీ–జేఏసీ) ఆధ్వర్యంలో అచ్చంపేట ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో గురువారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ కల్మమూల నాసరయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం సాధించినప్పటికీ ఉద్యమకారులు, పేద ప్రజలకు ఆశించిన ఫలితాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలతో అనేక మంది ఉద్యమకారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఉద్యమకారులను గుర్తించడం, 250 గజాల స్థలం కేటాయింపు, రూ.25,000 పింఛన్ వంటి హామీలను 2026 జనవరి 26 క్యాబినెట్ సమావేశంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మరో ఉద్యమానికి సిద్ధమవుతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. సమావేశంలో పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe