అచ్చంపేటలో సీసీ రోడ్ల నిర్మాణం వేగవంతం

అచ్చంపేట పట్టణంలోని 2వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులను సోమవారం మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాస్ ప్రత్యక్షంగా పరిశీలించారు. చైర్మన్ మాట్లాడుతూ, “సీసీ రోడ్లను నాణ్యత ప్రమాణాలతో, సమయానికి పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు సూచించాం. పట్టణ ప్రజలకు మెరుగైన రహదారి సదుపాయాలు అందించడం మున్సిపల్ ప్రాధాన్యత” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి సుంకరి నిర్మల బాలరాజు, ఆకుల వెంకటేష్, కౌన్సిలర్ ఎం.డి. ఖాదర్ (కోఆప్షన్ సభ్యుడు), కమిషనర్, ఏఈ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

 

WhatsApp Join Now
Youtube Subscribe