లోకవాణి న్యూస్, అక్టోబర్ 29: స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు అచ్చంపేట లోని వరద ప్రభావిత ప్రాంతాలను బుధవారం పరిశీలించారు. అచ్చంపేటలోని చింతల్ బస్తి, ఆదర్శ కాలనీ, వెంకటేశ్వర కాలనీ లు సందర్శించి వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించారు. మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొని సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నీటిముప్పు నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
