లోకవాణి న్యూస్, లింగాల, అక్టోబర్ 10:
నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం ఎర్రపెంట గ్రామానికి చెందిన లింగమ్మకు శుక్రవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ సహాయాన్ని కోరారు. అంబులెన్స్‌లో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చెన్నంపల్లిపల్లి గేట్ సమీపంలో పురిటి నొప్పులు అధికం కావడంతో అంబులెన్స్ సిబ్బంది సకాలంలో స్పందించి సురక్షితంగా సాధారణ ప్రసవం నిర్వహించారు. తల్లి లింగమ్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. సకాలంలో సేవలందించి సురక్షిత ప్రసవం జరిపినందుకు లింగమ్మ కుటుంబ సభ్యులు అంబులెన్స్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సేవను అందించిన అంబులెన్స్ సిబ్బందిలో టెక్నీషియన్ కే. వెంకటేష్, పైలట్ సి.పీ. శ్యామ్ రాజ్ (బల్మూర్ అంబులెన్స్) ఉన్నారు. వారి చొరవతో తల్లి, శిశువు ప్రాణాలు కాపాడగలిగామని అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై పీఎం శ్రీకాంత్ మరియు ఈఎంఈ శ్రీనివాస్ అంబులెన్స్ సిబ్బందిని అభినందించారు.
